: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు లెజెండ్ సినిమా బృందం కూడా ఉంది. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు బాలకృష్ణకు ఆశీర్వచనాలు పలికారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. లెజెండ్ సినిమా సక్సెస్ కావడంతో బాలకృష్ణ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.