: ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ర్యాగింగ్
ర్యాగింగ్ కోసం పటిష్ట చట్టాలను చేసినా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. ఆ వికృతత్వానికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులోని సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు బుధవారం సాయంత్రం ర్యాగింగ్ కు పాల్పడ్డారు.
తాళ్ళతో కాళ్ళూ, చేతులూ కట్టేసి జూనియర్లను ఎండలో కూర్చోపెట్టారు. కొంత సేపటి తర్వాత విడిచిపెట్టారు. సీనియర్ల వేధింపులపై జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు 14 మందిపై ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ రోజు వారిని అరెస్ట్ చేసారు.

- Loading...
More Telugu News
- Loading...