: పాకిస్థాన్ అభిమానికి ఫైనల్స్ టికెట్ ఇప్పించిన ధోనీ


ఎల్లలు దాటిన అభిమానానికి టీంఇండియా కెప్టెన్ ధోనీ మరింత సార్థకత చేకూర్చాడు. వివరాల్లోకి వెళ్తే... మహ్మద్ బషీర్ అనే పాకిస్థాన్ జాతీయుడు క్రికెట్ అంటే పడిచస్తాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 మ్యాచ్ లను చూడ్డానికి షికాగో నుంచి వచ్చాడు. లీగ్ దశలోనే పాక్ నిష్క్రమించినప్పటికీ భారత్ ఆడే మ్యాచ్ లు చూడాలని బంగ్లాదేశ్ లోనే ఆగిపోయాడు. అయితే భారత్, శ్రీలంకల మధ్య జరగనున్న ఫైనల్స్ మ్యాచ్ కు అతనికి టికెట్లు దొరక్కపోవడంతో ఉసూరుమన్నాడు.

నిన్న భారత్ ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు స్టేడియంకు వచ్చాడు. మరో విషయం ఏమిటంటే, గతంలో ఇంగ్లండ్ లో చాంపియన్స్ ట్రోఫీ జరిగేటప్పుడు ధోనీని బషీర్ కలిశాడు. ఈ పరిచయాన్ని గుర్తు పెట్టుకున్న ధోనీ బషీర్ ను పలకరించాడు. ఉబ్బితబ్బిబ్బయిన బషీర్ తనకు టికెట్ దొరకలేదనే విషయాన్ని ధోనీకి చెప్పాడు. వెంటనే స్టేడియంలో ఉన్న ఓ వ్యక్తిని పిలిచి బషీర్ కు టికెట్ ఇవ్వాలని ధోనీ కోరాడు. అతను బషీర్ కు కాంప్లిమెంటరీ పాస్ ఇచ్చాడు. దీంతో బషీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  • Loading...

More Telugu News