: ప్రొ. జయశంకర్ సోదరుడికి కేసీఆర్ నివాసం వద్ద అవమానం


తెలంగాణ సిద్ధాంతకర్తగా ఖ్యాతి గడించిన ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు వాసుదేవరావుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద అవమానం జరిగింది. కేసీఆర్ ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన వాసుదేవరావును అనుమతి లేకుండా లోనికి అనుమతించమని భద్రతా సిబ్బంది వెనక్కు పంపించేశారు. అయితే, విషయం తెలుసుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ నేత నాయని నర్సింహారెడ్డిని రంగంలోకి దించారు. వాసుదేవరావుతో నాయని ఫోనులో సంభాషించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ కుటుంబం నుంచి ఒక్కరికి వరంగల్ జిల్లా నుంచి అవకాశం కల్పించాలని కోరడానికే వాసుదేవరావు వచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News