: ఖోబ్రాగదే అంశం ముగిసిన అధ్యాయం కాదు: భారత్
అమెరికాలో అవమానానికి గురై వీసా మోసం వంటి అక్రమ అభియోగాలను ఎదుర్కొంటున్న భారత దౌత్యవేత్త ఖోబ్రాగదే అంశం ఇంకా సమసిపోలేదని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతాసింగ్ ను ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా ఆమె పై విధంగా బదులిచ్చారు. ఖోబ్రాగదే కేసు విషయంలో పలు అంశాలు ఇంకా పరిష్కృతం కావాల్సి ఉందన్నారు. వాటిని ఇప్పటికే అమెరికాకు తెలియజేశామని చెప్పారు. మొదటి సారి నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేసినప్పటికీ, దర్యాప్తు అధికారులు తిరిగి అభియోగాలు మోపడంపై తమ అసంతృప్తి తెలియజేశామన్నారు.