: విదేశీ మహిళా రోగిపై అపోలో డాక్టర్ కామ చర్యలు


అమెరికాకు చెందిన 22 ఏళ్ల యువతి వైద్యం కోసం ఢిల్లీలోని ఆపోలో ఆస్పత్రికి వెళ్లగా కామంతో కళ్లు మూసుకుపోయిన వైద్యుడు వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఒక వారం క్రితం అనారోగ్యంతో సరితా విహార్ లోని అపోలో ఆస్పత్రికి సదరు యువతి వెళ్లింది. వైద్యుడు ఆమెను స్ట్రెచర్ పై పడుకోవాలని సూచించాడు. ఆమె పడుకున్న అనంతరం అవసరం లేని చోటల్లా నొక్కడం మొదలు పెట్టాడు. వైద్యుడు పరీక్షిస్తున్నాడేమోనని తొలుత ఆమె ఓపిక పట్టింది. దీంతో వైద్యుడు మరికాస్త రెచ్చిపోయాడు. ఇంకా ఎక్కడెక్కడో చేతులతో పరీక్షిస్తూ కామ దాహం తీర్చుకునే చర్యలకు తెరతీశాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు సదరు వైద్యుడిని అరెస్ట్ చేశారు. అయితే, తానేమీ అసభ్యంగా ప్రవర్తించలేదని, తన డ్యూటీ తాను చేశానని వైద్యుడు సమర్థించుకున్నాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను అందించాలని పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని కోరారు.

  • Loading...

More Telugu News