: యువీ, నేహా లవ్వాయణం..!
భారత క్రికెట్ సుందరాంగుడు యువరాజ్ సింగ్ మళ్ళీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాడు. అయితే క్రికెట్ మైదానంలో కాదు సుమా. క్యాన్సర్ నుంచి కోలుకుని గతేడాదే క్రికెట్ బరిలో దిగిన యువీ.. తాజాగా లవ్ పిచ్ పై సిక్సర్లు బాదుతున్నట్టు సమాచారమ్. అందుకు సాక్ష్యం కావాలంటే, ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ షోకి వెళ్ళాల్సిందే. బాలీవుడ్ లో లిప్ టు లిప్ చుంబనాలకు సరికొత్త భాష్యం చెప్పిన భారీ అందాల సుందరి నేహా ధుపియాతో యువీ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు అటు క్రికెట్ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ గుసగుసలు బయల్దేరాయి.
ముంబయిలో ఫ్యాషన్ వీక్ చివరి రోజు షోకి ఒకే కార్లో వచ్చిన ఈ జోడీ కార్యక్రమం కొనసాగినంత సేపు ఒకరిచేయి మరొకరు వదల్లేదట. దీంతో, అందరి అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇదిలావుంటే, యువీకి కిమ్ శర్మ, దీపికా పదుకొనేలతో అఫైర్లున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీపిక విషయంలో కెప్టెన్ ధోనీకి, యువీకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయన్నది బహిరంగ రహస్యం.