: పగ తీర్చుకోవాలంటే బీజేపీకి ఓటు: అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, ఉత్తరప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అమిత్ షా ఎన్నికల కోడ్ ను అతిక్రమించి ఓటర్లను రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని యూపీ కాంగ్రెస్ ఆరోపించింది.

పగ తీర్చుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ షాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని కూడా కాంగ్రెస్ కోరింది.

  • Loading...

More Telugu News