: ఎన్నికల కోడ్ అతిక్రమించిన వారిపై లక్షకు పైగా కేసులు


ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేయడం, వాల్ పోస్టర్లు అంటించడం వంటి వాటిపై 1.09 లక్షల కేసులు పోలీసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. లైసెన్సు ఉన్న సుమారు 18 వేల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 3,350 నాన్ బెయిలబుల్ వారెంట్స్ లో 1309 వారెంట్స్ ను మాత్రమే అమలు చేయగలిగారు.

ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న 2,26,208 లీటర్లు మద్యాన్ని సీజ్ చేశారు. డబ్బు పంపిణీ చేసి ఓటర్లు ప్రలోభపెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు వాహనాల్లో తరలిస్తున్న సొమ్ము పెద్ద మొత్తంలో పట్టుబడింది. ఇప్పటివరకు రూ. 81.90 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హైదరాబాదు జిల్లాలో రూ. 16.62 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ. 10.56 కోట్లు, రంగారెడ్డిలో రూ. 7.73 కోట్లు, గుంటూరులో రూ. 5.25 కోట్ల నగదు వాహన తనిఖీల్లో పట్టుబడింది.

  • Loading...

More Telugu News