: మోడీపై వ్యాఖ్యలు కావూరి విజ్ఞతకే వదిలేస్తున్నా: రణదీప్ సింగ్ సూర్జివాలా


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ప్రశంసించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జీవాలా మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చాలా మంది వ్యక్తిగత విలువలు వదిలేస్తున్నారని అన్నారు. కావూరి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను విడదీయటమే బీజేపీ మేనిఫెస్టో అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News