: టీడీపీతో పొత్తు నేడు ఖరారవుతుంది: కిషన్ రెడ్డి
టీడీపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని... నేడు సీట్ల సర్దుబాటు వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదని, నామినేషన్లు కూడా దాఖలు చేయలేదని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి పాటు పడతారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు.