: మొబైల్లో ఎక్కువ మాట్లాడితే మగతనానికి దెబ్బట!


మొబైల్ లో గలగల మాట్లాడుతూనే నిద్ర లేస్తున్నారా? మాట్లాడుతూనే తినడం, తాగడం, పడుకోవడం అలవాటైపోయిందా? అయితే ఇలా మొబైల్ పై ఎక్కువ సమయం గడిపితే మగవారి శృంగార సామర్థ్యానికి గొడ్డలి పెట్టవుతుందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తక్షణమే మొబైల్ వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రోజుకు రెండు గంటల్లోపు వాడే వారి కంటే.. నాలుగు గంటలకంటే ఎక్కువ వాడే మగవారికి ఆ సామర్థ్యం ఎక్కువగా దెబ్బతింటుందని వారు చెబుతున్నారు.

మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషనే ఇందుకు కారణంగా వారు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న 20 మందిని, ఆ సమస్య లేని మరో 10 మందిని ఎంపిక చేశారు. వారి దిన చర్యను పరిశీలించగా... అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్న వారు రోజులో 4 గంటలకు పైగా మొబైల్ లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ సమస్య లేని వారు రోజులో గట్టిగా 2 గంటలు కూడా మాట్లాడడం లేదట. కనుక మగవారు మొబైల్ విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తే మంచిదేమో!

  • Loading...

More Telugu News