: కిరాణా కొట్లలో గ్యాస్ సిలిండర్ల విక్రయం


ఉన్నట్లుండి కిచెన్ లో గ్యాస్ అయిపోతే పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బతిమాలుకుంటే గానీ సిలిండర్ దొరకని పరిస్థితి. ఇకపై ఈ కష్టాలకు తెరపడనుంది. వీధిలో ఉన్న కిరాణా కొట్లలోనే గ్యాస్ సిలిండర్లు లభించనున్నాయి. కాకపోతే ఇవి 5కేజీల సిలిండర్లు, సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకే లభిస్తాయి. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఈ సేవలను ప్రారంభించింది. ఐడీ ప్రూఫ్ చూపించి బ్లూరంగులో ఉండే ఈ సిలిండర్లను తీసుకెళ్లవచ్చు. మొదటి సిలిండర్ కు 1600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలు చేసేవాటికి మార్కెట్ ధర చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి బెంగళూరు, చైన్నై, గోరఖ్ పూర్, లక్నో, అలీగఢ్ లో ఇవి లభించనున్నాయి. తర్వాత దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ఐవోసీ సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News