: బ్రదర్ అనిల్ కుమార్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
పాస్టర్ల సదస్సు నిర్వహించి డబ్బులు పంచుతున్నారంటూ వైకాపా అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ పై రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చిత్తూరులోని కారుణ్య క్యాంపస్ లో ప్రేమ విందు పేరుతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని... ఒక్కో పాస్టరుకు రూ. 20 వేలు పంచుతున్నారని తెలిపింది. దీనికి తోడు ఒక్కో చర్చికి రూ. 3 నుంచి 5 లక్షల వరకు ఇస్తామని అనిల్ వాగ్దానం చేసినట్టు ఆరోపించింది. అంతేకాకుండా, వైకాపాకు ఓటు వేసి, వేయించాలని బైబిల్ పై అనిల్ ప్రమాణం కూడా చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది.