: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగన్ ‘జనభేరి’


వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమమైన ‘జనభేరి’ శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు (గురువారం) జిల్లాలోని టెక్కలిలోని రోడ్ షోలో పాల్గొన్న అనంతరం బహిరంగసభలో జగన్ మాట్లాడారు. నాయకుడంటే విశ్వసనీయత ఉండాలని ఆయన అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడిలో విశ్వసనీయత మచ్చుకైనా కనపడదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేద ప్రజల క్రితం రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రారంభిస్తే... రూ.5.25 కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఆయన చెప్పారు. అన్నదాతలకి ఉచితంగా కరెంట్ ఇస్తానని వైఎస్ హామీ ఇస్తే... దానిని బాబు అపహాస్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News