: యూపీ సీఎం అఖిలేశ్ కు చిదంబరం ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై ఆర్ధికమంత్రి చిదంబరం ప్రశంసల వర్షం కురిపించారు. యూపీ అభివృద్ధిపై పూర్తి అవగాహన కలిగిన యువనేత అఖిలేశ్ అని పొగిడారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కావాలసిన నిధులను, సహాయాన్ని కేంద్రం అందిస్తుందని తెలిపారు. లక్నోలో ఈ రోజు ఆన్ లైన్ ద్వారా 300 బ్యాంకు శాఖలను చిదంబరం ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. అఖిలేశ్, అతని క్యాబినెట్ టీమ్, ములాయంకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రెండురోజుల కిందట కాంగ్రెస్ పై ఎస్పీ అధినేత ములాయం తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూపీఏకు మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.