: విమాన ప్రయాణం కొంచెం భారం


దేశంలో విమాన ప్రయాణం కొంచెం భారమైంది. నిన్నటి వరకూ డిస్కౌంట్ ఆఫర్లతో అదరగొట్టిన విమానయాన సంస్థలు ఇంధన సర్ చార్జ్ ను పెంచడం ద్వారా దేశీయ ప్రయాణికులపై అదనపు వడ్డింపులకు దిగాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా, ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్ వేస్ 150 రూపాయల వరకూ సర్ చార్జ్ పెంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశంలోపల 1000 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే వారిపై 100, అంతకు మించిన ప్రయాణమైతే 150 రూపాయల చొప్పున సర్ చార్జ్ పెరిగింది. ఇండిగో కూడా త్వరలో పెంపుపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 

  • Loading...

More Telugu News