: సినీ నటుడు మురళీమోహన్ అరెస్ట్
సినీ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ ను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న ద్వారకాతిరుమలలో అనుమతి లేకుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీమోహన్ తో పాటు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీరమణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని భీమడోలు కోర్టులో హాజరుపరిచారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి లోక్ సభకు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఆయన పరాజయం పాలైన సంగతి తెలిసిందే.