: బీజేపీ కూడా బీసీలకు సీట్లు కేటాయించాలి: కృష్ణయ్య
బీజేపీ కూడా బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని టీడీపీ తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేపటికి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలంగాణకు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీకి సీఎం పదవి హామీ ఇచ్చిన వారిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.