: చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తల ఆందోళన


టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసం ఎదుట బైఠాయించి, ఆందోళన చేశారు. బీజేపీతో పొత్తులో భాగంగా సికిందరాబాద్ లోక్ సభ సీటును ఆ పార్టీకి కేటాయించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా పాలుపంచుకున్నారు. బీజేపీకి సీటు కేటాయిస్తే టీడీపీకి నష్టం జరుగుతుందని నినాదాలు చేశారు. అలాగే మహేశ్వరం, మహబూబ్ నగర్ నుంచి కూడా పెద్దఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. వీరు కూడా ఆయా స్థానాలను బీజేపీకి ఇవ్వరాదని నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News