: తిరుమలేశుని దర్శించుకున్న బాలకృష్ణ


సినీ హీరో బాలకృష్ణ ఇవాళ తిరుమలేశుని దర్శించుకున్నారు. ‘లెజెండ్’ సినిమా యూనిట్ విజయోత్సవ యాత్రలో భాగంగా యూనిట్ సభ్యులు గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన బాలకృష్ణను అభిమానులు శాలువాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... పైరసీని అరికట్టాలని అభిమానులను కోరారు. లెజెండ్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News