: రూ.2,500కోట్లు చెల్లిస్తామని సుప్రీంకు సహారా ప్రతిపాదన
సుబ్రతారాయ్ బెయిల్ కు తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు సహారా సంస్థ ఈ రోజు ప్రతిపాదించింది. ఆయన విడుదలయిన తర్వాత మిగతాది చెల్లిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదలను కోర్టు తిరస్కరించింది. దాంతో, సుబ్రతా విడుదలకు సహారా చేసిన యత్నం విఫలమైంది. గత విచారణ సమయంలో సుబ్రతాకు బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం రూ.5,000 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.