: పాలించను...సేవ చేస్తా: మోడీ
తాను రాజకీయాల్లో ఉన్నది సేవ చేయడానికే తప్ప పరిపాలించడానికి కాదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. జార్ఖాండ్ లో ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏసీ గదుల్లో ఉన్నవారి కోసమే జరిగిందని మండపడ్డారు. సామాన్యుడిని కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 6 నెలల సమయం ఇవ్వండి, పాలన అంటే ఏంటో తాను చూపిస్తానని మోడీ తెలిపారు. లాలూ లాంటి అవినీతి పరులతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రోజుకో రీతిన మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.