: నేరచరిత్ర నిరూపిస్తే రాజకీయ అస్త్ర సన్యాసమే: బస్వరాజు సారయ్య
తనకు నేరచరిత్ర ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. భూదందాలు, అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే తన ఆస్తిని పేదలకు రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఎవరి బెదిరింపులకు తలొగ్గకుండా, 2014 ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.