: నరేంద్రమోడీపై అసమంజసమైన వ్యాఖ్యలు చేశా: స్మృతి ఇరానీ


గుజరాత్ అల్లర్ల (2002) తర్వాత... బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై తాను అసమంజసమైన వ్యాఖ్యలు చేశానని అమేథి లోక్ సభ బీజేపీ అభ్యర్థి, నటి స్మృతి ఇరానీ ఒప్పుకున్నారు. న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘మోడీనుద్దేశిస్తూ చాలా అసమంజసంగా మాట్లాడాను. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. మోడీ పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

స్థానికేతరులకు అవకాశం ఇవ్వొద్దంటూ తననుద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్మృతి స్పందించారు. రాహుల్ మాత్రం అమేథిలో జన్మించాడా? కనీసం ఆ నియోజకవర్గానికి చెందినవాడు కూడా కాదని ఆమె విమర్శించారు. సోనియాగాంధీ రాయ్ బరేలీకి చెందినదా? అని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News