: విద్యుత్ సమస్యకు వామపక్షాలే కారణం


రాష్టంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడ్డానికి వామపక్షాలే కారణమని వైద్యవిద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి ఆరోపించారు. లెఫ్ట్ పార్టీలు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం అడ్డుకోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని కొండ్రు మండిపడ్డారు. చేతనైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పరిపాలన చేయాలని ఆయన వామపక్షాలకు సవాల్ విసిరారు. 

కాగా,  ఇటీవల వామపక్ష పార్టీలు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇదే అంశంపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరవధిక దీక్షలు చేస్తోన్న సంగతి విదితమే. దీక్షలో పాల్గొంటోన్న టీడీపీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది.

  • Loading...

More Telugu News