: టీ20లో ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసిన ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయకేతనం ఎగురవేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్ చేరలేకపోయిన ఆసీస్ తన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
ఆసీస్ ఓపెనర్ ఫించ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. వార్నర్ 48, వైట్ 18, బెయిలీ 11 పరుగులు చేశారు. ఫించ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన విషయం విదితమే. షకీబ్-అల్-హసన్ (66) రహీమ్ (47) రాణించారు.