: మూడు చక్రాల స్కూటర్ ఖరీదు మూడు లక్షలు మాత్రమే!
ఆటోమొబైల్స్ తయారీ దిగ్గజం యమహా మూడు చక్రాల స్కూటర్ ను తయారుచేసింది. చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉన్న దీనికి ‘ట్రైసిటీ’ అని పేరు పెట్టింది. ఈ వేసవిలో దీన్ని యూరప్ మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర 4 వేల యూరోలు మాత్రమే... అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3,34,278 లక్షలు.
రద్దీ రోడ్లపై ట్రాఫిక్ లో ప్రయాణించేందుకు వీలుగా ఈ స్కూటర్ ను తయారుచేశారు. కంపాక్ట్ డైమెన్షన్ తో 125 సీసీ సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. ఈ ట్రైసిటీ బరువు 152 కిలోలు.