: రూపాయికే విమాన ప్రయాణం స్పూర్తిగా కొత్త ఆఫర్


విమాన యానం రోజురోజుకూ అందరికీ అందుబాటులోకి వస్తోంది. గత త్రైమాసికంలో 75 శాతం విమాన ఛార్జీలను తగ్గించిన స్పైస్ జెట్ ఒక రూపాయికే విమాన ప్రయాణం అంటూ అందర్నీ ఆకర్షించింది. తాజాగా మరో స్కీముతో ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మంగళవారం నుంచి మూడు రోజల్లోగా ప్రయాణించే వారు 799, 1499 రూపాయలకే టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే టికెట్ రేటుకు అదనంగా ఎయిర్ పోర్టు ఫీజు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో తాము ప్రకటించిన రూపాయికే విమాన ప్రయాణం ఆఫర్ కి వచ్చిన స్పందన స్పూర్తిగా కొత్త ఆఫర్ ప్రకటించామని స్పైస్ జెట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News