: లోక్ సభ ఎన్నికల బరిలో సీపీఐ నారాయణ
ఖమ్మం లోక్ సభ స్థానానికి సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేరు ఖరారైంది. ఖమ్మంలో ఈరోజు జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సీపీఐ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ రెండు లోక్ సభ, 17 శాసనసభ స్థానాలను కోరుతున్న విషయం విదితమే. అయితే కాంగ్రెస్ ఒక లోక్ సభ, 12 శాసనసభ స్థానాలను ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. సీపీఐ ఖమ్మం, నల్లగొండ లోక్ సభ స్థానాలను కోరుతుండగా.. ఖమ్మం నుంచి నారాయణను పోటీకి నిలపాలని తీర్మానించారు. నల్గొండ స్థానం కూడా కేటాయిస్తే సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని పోటీకి దింపే అవకాశం ఉంది.