: సీమాంధ్రుల ప్రయోజనాలకు అనుకూలంగా టీడీపీ మేనిఫెస్టో ఉంది:హరీష్ రావు
తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ మేనిఫెస్టో తెలంగాణ ప్రజల గొంతుకోసేలా ఉందని అన్నారు. నవ తెలంగాణ టీడీపీతోనే సాధ్యమనడాన్ని మిలీనియం జోక్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.