: రజనీ కుమార్తెకు అమితాబ్ ప్రశంసలు
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య అశ్విన్ పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ప్రశంసలజల్లు కురిపించారు. భారత దేశపు తొలి మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ 3డి యానిమేటెడ్ సినిమాను సౌందర్య అశ్విన్ తెరకెక్కించిన విధానం అద్భుతమని ఆయన అన్నారు. ఇది నిజంగా భారత దేశం గర్వించదగ్గ విషయమని ఆయన అభినందించారు. దేశంలో తొలి అత్యుత్తమ సాంకేతికత కలిగిన ఈ సినిమా నిర్మాణం, విజయం సాధించడం రెండూ మహిళాసాధికారతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
'కొచ్చాడయాన్' సినిమా ట్రైలర్ ను తాను విడుదల చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన కుమార్తెపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించడం రజనీకాంత్ కే సాధ్యమైందని ఆయన అన్నారు. 'కొచ్చాడయాన్'లో రజనీకాంత్, దీపికా పదుకొనే, జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాజర్, శరత్ కుమార్, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించారు.