: ముషారఫ్ గుట్టురట్టు చేసిన బ్రిటిష్ జర్నలిస్టు


తాను ఉదారవాదినని, ఉగ్రవాదం అంతానికి చాలా కృషి చేశానని చెప్పుకునే పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, జనరల్ పర్వేజ్ ముషారఫ్ గుట్టును ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కార్లోట్టా గాల్ రట్టు చేశారు. అమెరికా మట్టుబెట్టిన అల్ ఖైదా నాయకుడు ఒసామబిన్ లాడెన్ అజ్ఞాతంలో ఎక్కడ ఉండేవాడో ముషారఫ్ కు తెలుసని బయటపెట్టారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కోసం పాకిస్థాన్ లో చాలాకాలం జర్నలిస్టుగా సేవలందించిన కార్లోట్టా గాల్ 'రాంగ్ ఎనిమీ' అనే 300 పేజీల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ముషారఫ్ కు చెందిన చాలా విశేషాలను ఆమె వెల్లడించారు.

కాశ్మీర్ తీవ్రవాదులకు మద్దతిస్తున్నానని, అదే సమయంలో ఆల్ ఖైదాకు మద్దతు ఇవ్వడం లేదని ముషారఫ్ చాలాసార్లు వాదించారు. కోర్టు అనుమతించి ఉంటే ముషారఫ్ కాలంలో చాలా రహస్యాలు వెలుగుచూసి ఉండేవని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు. ముషారఫ్ పాకిస్థాన్ కోర్టులో దేశద్రోహం నేరం సహా పలు నేరాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News