: భార్య ప్రచారం కోసం షూటింగ్ లన్నీ రద్దు చేసుకున్న అనుపమ్ ఖేర్
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున హర్యానాలోని చండీఘడ్ నుంచి పోటీ చేస్తున్న తన భార్య కిరణ్ ఖేర్ కు ప్రచారం చేయడం కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ షూటింగులన్నీ రద్దు చేసుకున్నారు. తన భార్యకు తన ప్రచారం అవసరం లేనప్పటికీ భర్తగా తాను ప్రచారం చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఒత్తిడి తట్టుకునేందుకు వయసుతో సంబంధం లేదని కిరణ్ ఖేర్ ప్రత్యర్థి, మరో బాలీవుడ్ నటి, ఆప్ అభ్యర్థి గుల్ పనాగ్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. కిరణ్ తాను ఇద్దరమూ యోధులమేనని, దేని గురించీ తమకు భయం లేదని ఆయన తెలిపారు.