: 90 శాతం పోలింగ్ జరిగేలా చర్యలు: భన్వర్ లాల్


రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 18 శాతం పోలింగ్ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఓటర్ల నమోదులో చూపించిన ఉత్సాహమే పోలింగ్ లోనూ కనిపిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

రాజకీయ పార్టీలు మంచి వ్యక్తులకే టికెట్లు కేటాయించాలని భన్వర్ లాల్ కోరారు. మంచి అభ్యర్థులను నిలుపని పక్షంలో ఓటర్లు ‘నోటా’ (తిరస్కరణ ఓటు)తో సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 10 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు రెండు లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేయకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు 70 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని భన్వర్ లాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News