: పోలింగ్ కేంద్రాలో పొగ తాగితే జరిమానా!


వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన బీహార్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పొగతాగకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లక్ష్మణన్ తెలిపారు. సిగరెట్స్, ఇతర టొబాకో ప్రొడక్ట్ యాక్ట్ సెక్షన్ 4 కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే 200 రూపాయల జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. బీహార్ లోని 40 లోక్ సభ నియోజకవర్గాల్లో 59,807 పోలింగ్ కేంద్రాలున్నాయి.

  • Loading...

More Telugu News