: ఆ కుటుంబంలో ఓటర్లు 47 మంది!


ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీహార్ లోని కిషన్ గంజ్ నియోజకవర్గంలోని ఆ ఇంటికి రాజకీయ నాయకులంతా క్యూ కడుతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో రాజకీయ కురువృద్ధుడు ఉన్నారా అంటే అలాంటిదేం లేదు. అయినప్పటికీ అక్కడికి రాజకీయనాయకులు క్యూ కట్టడానికి కారణం, ఆ కుటుంబంలో ఏకంగా 47 ఓట్లు ఉండడమే! బీహార్ లో ఉమ్మడి కుటుంబాలు సర్వసాధారణం. అలాంటిదే పుర్నియా జిల్లాలోని జియాగచి గ్రామంలో నివసించే మహ్మద్ నజీర్ కుటుంబం.

ఈ కుటుంబంలో మొత్తం 85 మంది సభ్యులు ఉండగా, ఓటు హక్కు కలిగిన వారు 47 మంది. దీంతో వీరి కుటుంబానికి ఎన్నికల సమయంలో కాస్త గిరాకీ ఎక్కువ. రాజకీయ నాయకులంతా వీరిని కలిసేందుకు వస్తుంటారు. విడివిడిగా వున్నా డజను కుటుంబాలతో తమ కుటుంబం సమానం కనుకే రాజకీయ నాయకులు తమ ఇంటికి వస్తారని ఇంటి పెద్ద పేర్కొంటున్నారు.

మూడు తరాల కుటుంబ సభ్యులు కలిసి ఉండడంతో రోజుకు 20 కేజీల బియ్యం, 20 కేజీల గోధుమలు అవసరం అవుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నజీర్ ఇద్దరు తమ్ముళ్లు స్కూలు టీచర్లు. నజీర్ తమ్ముడి భార్య ఆ ఊరి సర్పంచ్. వీరికి 20 బీఘాల వ్యవసాయభూమి ఉంది. ఈ ఇంట్లో అందరూ విద్యావంతులే కావడం విశేషం!

  • Loading...

More Telugu News