: హాంగ్ కాంగ్ అతిధులు చాలా 'కాస్ట్ లీ'
హాంగ్ కాంగ్ పర్యాటకులు మనదేశ హోటళ్లకు కాసులు కురిపిస్తున్నారు. గతేడాది మనదేశానికి వచ్చిన విదేశీ సందర్శకుల్లో హాంగ్ కాంగ్ దేశీయుల నుంచే అధిక ఆదాయం వచ్చింది. ఒక్కొకరు ఒక రోజుకు 8,061 రూపాయలు చెల్లించారు. పశ్చిమాసియా అతిధులు రెండో స్థానంలో ఉన్నారు. వీరు సగటున ఒక్కొకరు రూ.7,909 చెల్లించారు. వీరి తర్వాత రూ.7594 రూపాయల చెల్లింపులతో దక్షిణాఫ్రికన్లు మూడో స్థానంలో ఉన్నట్లు హోటల్స్ డాట్ కామ్ వెల్లడించింది.