: ఎన్డీయేకు 233... యూపీయేకు 119 సీట్లు


కేంద్రంలో ఎన్నికల అనంతరం ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడనుందని మరో పోల్ సర్వే తెలియజేసింది. ఏబీపీ న్యూస్ కోసం ఏసీ నీల్సన్ నిర్వహించిన తాజా సర్వేలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 233 లోక్ సభ స్థానాలు వస్తాయని... అదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ పరిస్థితి 119 స్థానాలకు దిగజారుతుందని వెల్లడైంది. బీజేపీ సొంతంగా 209 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్ 91 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. ఇతర పార్టీల విషయానికొస్తే అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ కు 28, వామపక్షాలకు 23, ఏఐడీఎంకేకు 21, బీఎస్పీకి 18, బీజేడీకి 17 స్థానాలు రానున్నట్లు సర్వే పేర్కొంది.

  • Loading...

More Telugu News