: దిగుమతి అయిన రాక్షసుల అంతు మోడీ చూస్తారు: రామ్ దేవ్
యోగా గురు రాందేవ్ బాబా మరోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని సోనియా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఖాన్లు, దిగుమతి చేసుకున్న రాక్షసుల (ఆయన భావం సోనియా తదితరులు) సంగతి మోడీ చూస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో 60 స్థానాలకు మించి రాబోవన్నారు.