: బీజేపీ మళ్లీ తప్పు చేసింది!


చేసిన తప్పునే బీజేపీ మళ్లీ చేసింది. కర్ణాటకలో ప్రమోద్ ముతాలిక్ విషయంలో చేసిన తప్పును బీహార్ లో పునరావృతం చేసింది. కొత్త సభ్యుడిని చేర్చుకుని, ఆనక వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొద్ది గంటల్లోనే అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. బీహార్ కు చెందిన వివాదాస్పద నేత సబీర్ అలీ నిన్న బీజేపీలో చేరారు. ఉగ్రవాది యాసిన్ భత్కల్ కు అతను సన్నిహితుడన్న వార్తల నేపథ్యంలో అతనిని పార్టీలో చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సబీర్ అలీ సభ్యత్వాన్ని బీజేపీ నేతలు యుద్ధ ప్రాతిపదికన రద్దు చేశారు.

  • Loading...

More Telugu News