: మళ్లీ సొంత గూటికి చేరనున్న ఎంపీ వివేక్!?
కరీంనగర్ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ ను వీడి సొంత గూటికి (కాంగ్రెస్) చేరే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. కేకే, మందా జగన్నాథంలతో కలసి టీఆర్ఎస్ లోకి వివేక్ చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన టీఆర్ఎస్ వ్యవహారాల్లో అంటీముట్టనట్టే వ్యవహరించారు. గత కొంత కాలంగా ఆయన టీఆర్ఎస్ ను వీడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం కేసీఆర్ ను కూడా వివేక్ కలిశారు. అయితే, ఊహించని విధంగా ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం అవడంతో... ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. వివేక్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించలేదు. దీంతో సొంత గూటికి వివేక్ చేరడం లాంఛనమే అని తెలుస్తోంది.