: 75 ఏళ్ళు దాటితే ఇంటికే పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ తీసుకుని 75 ఏళ్ల వయసు దాటిన వారికి శుభవార్త. ఇలాంటి వారు పెన్షన్ కోసం బ్యాంకుకువెళ్లి క్యూలో నిల్చుని పడే అవస్థలకు త్వరలో తెరపడనుంది. బ్యాంకు సిబ్బందే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్లనున్నారు. ప్రభుత్వ రంగంలోని ఎస్ బీఐ తొలిసారిగా ప్రయోగాత్మకంగా దీన్ని కోల్ కతాలో ఏప్రిల్ 1న ప్రారంభించనుంది.