: జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం: బాబు
టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ 33వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉండగా అంటువ్యాధులను అరికట్టామని, ఇప్పుడు వ్యాధుల నివారణకు అందరికీ అందుబాటులో ఆసుపత్రులు కడతామని అన్నారు. నిర్భయ చట్టం అమలులో ఉన్నా అత్యాచారాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా టీడీపీ పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.