: గవాస్కర్ నియామకంపై పాక్ మాజీల హర్షధ్వానాలు


ఐపీఎల్ 7 వ్యవహరాలు చూసుకునేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్ ను సుప్రీంకోర్టు నియమించడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు స్వాగతించారు. బీసీసీఐ నిర్వహణలో పాతతరం క్రికెటర్లు ప్రముఖ పాత్ర పోషించడం గర్వంగా ఉందని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు.

'ఇది చాలా శుభపరిణామం. క్రికెటర్లు ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటారని నేనెప్పుడూ నమ్ముతాను. స్పాట్ ఫిక్సింగ్ తో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ లో గవాస్కర్ తప్పకుండా సమున్నత మార్పులు తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఆయనంటే నాకెంతో గౌరవం. ఈ పదవికి అతనే సరైన వ్యక్తి అని భావిస్తున్నాను. భవిష్యత్తులో చాలామంది క్రికెటర్లు ఆట తర్వాత అడ్మినిస్ట్రేషన్ ను ఒక భాగంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను' అని వకార్ తెలిపాడు.

స్కాంలకు పాల్పడేందుకు భారత, ప్రపంచ క్రికెట్ కు ఐపీఎల్ ఒక ఆసరాగా మారిందని, ఇలాంటి వాటికి గవాస్కర్ వంటి వ్యక్తి చాలా అవసరమని మాజీ టెస్టు బ్యాట్స్ మెన్ మొహ్ సిన్ ఖాన్ అన్నాడు. అనుభవం కలిగిన, క్రికెట్ ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అతడే అని ప్రశంసించాడు. ఇంకా పలువురు సునీల్ గవాస్కర్ నియామకంపై స్పందించారు.

  • Loading...

More Telugu News