: నేటి రాత్రి 8.30గంటలకు అంతటా అంధకారం
రాత్రి 8.30గంటలకు ఒక్కసారిగా మీ చుట్టుపక్కల ఇళ్లలో చీకటి అలముకోవచ్చు. అందరూ లైట్లను ఆర్పివేయవచ్చు. పర్యావరణ ప్రేమికులైతే మీరూ వారితో కలసి ఓ గంటపాటు అలా చీకట్లో మీ వంతుగా ఉద్యమంలో పాల్గొనవచ్చు. అదే ఎర్త్ అవర్. పర్యావరణ పరిరక్షణపై స్పృహ, అవగాహన కల్పించడంలో భాగంగా 2009 నుంచి ఏటా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' అనే సంస్థ నిర్వహిస్తోంది. భూగోళ పరిరక్షణకు ఓ గంటపాటు లైట్లను ఆర్పేయమని ఈ సంస్థ కోరుతోంది. వీలుంటే లైట్స్ ఆఫ్ చేయండి.