: రెండో భార్యకు మొదటి భార్య బంధువుల కోటింగ్
ఇంటి సమస్యను రచ్చ చేసుకున్నదో కుటుంబం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామంలో ఒక మహిళను మరో మహిళ బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టారు. గ్రామానికి చెందిన అల్లావుద్దీన్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, అల్లావుద్దీన్ మరో మహిళను పెళ్లాడాడు. దీంతో మొదటి భార్య బంధువులు రెండో భార్యను కట్టేసి చితక్కొట్టారు. అయితే, మొదటి భార్యను ఒప్పిస్తానంటూ తనను అల్లావుద్దీన్ పెళ్లి చేసుకున్నాడని సదరు బాధితురాలు చెబుతోంది. గ్రామస్థులు జోక్యం చేసుకుని దాడిని ఆపారు. ఇంతలో అల్లావుద్దీన్ అక్కడి నుంచి పరారయ్యాడు.