: కెప్టెన్సీకి రాజీనామా చేసే యోచనలో ధోనీ


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో తన పేరు రావడంపై టీమిండియా కెప్టెన్ ధోనీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఫిక్సింగ్ ఉదంతంపై సుప్రీంకోర్టులో రెండు రోజుల పాటు సాగిన విచారణలో... ధోనీ పేరు కూడా పలు మార్లు వినిపించింది. దీంతో, ధోనీ కలత చెందాడు. తనపై పడ్డ మచ్చను తొలగించుకోవడానికి... చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి, ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ధోనీని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్, చైన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్ ఓదారుస్తున్నట్టు తెలుస్తోంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ ధోనీకి శ్రీనివాసన్ సూచిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News