: పరిటాల గుండు గీయించినప్పుడు ఈ పౌరుషం ఏమైంది?: పవన్ పై పొన్నం సెటైర్
జనసేన అధినేత పవన్ పై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయతీ గురించి మాట్లాడే నీవు ఇన్కంట్యాక్స్ సరిగా చెల్లిస్తున్నావా? అని ప్రశ్నించారు. భార్యలకు విడాకులిచ్చినప్పుడు చెల్లించిన కోట్లాది రూపాయలు బ్లాక్ మనీనా? లేక వైటా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు, సీట్ల కోసం కానప్పుడు... పార్టీ ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించారు. పరిటాల రవి గుండు గీయించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు... అప్పుడు ఈ పౌరుషం ఏమైంది? అంటూ సెటైర్ విసిరారు.