: వైభవంగా ప్రారంభమైన కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ధ్వజపటాన్ని ఎగరవేసి... సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి వారు తిరుచ్చి వాహన సేవలో విహరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులకు రామకోటి రాసే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. స్వామివారు రాత్రికి పెద్దశేష వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు.